Description

శ్లో॥ ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ శ్రియమిచ్చేతు హుతాశనః ఈశ్వరాత్ జ్జానమన్విచ్చేత్ మోక్షమిచ్చేజ్జనార్ధనః దుర్గాదిభిః తాధారక్షాం బైరవాద్యస్తు దుర్గమమ్ విద్యాసారం సరస్వత్యాం లక్ష్మ్యాచైశ్వ్యత్య వర్దనం పార్వత్యాచైవసౌభాగ్యం శచ్యా కళ్యాణ సంతతిః స్కందాత్ ప్రజాభివృద్దిశ్చ సర్వచైవ గణాధిపాత్ ప్రకారముగా శ్రీ గణపతి దేవాలయము నందు శ్రీ నవగ్రహ ఆలయములో సూర్యునితో కలిసి ఉన్న నవగ్రహ సమూహము న్న ఆరాధించినా ఆరోగ్యసిద్ధి అగ్నిహోత్రుని హోమ రూపములో శ్రీ గణపతి చండీ మన్యు రుద్ర సుబ్రహ్మణ్య ఆదిత్యాది నవగ్రహ ఇత్యాది హోమములు నిర్వహించగల ధన లాభము ఉమామహేశ్వర ఆరాధన వలన జ్ఞానము క్షేత్రపాలకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల మోక్షము శ్రీ ఉమామహేశ్వర ఆరాదన వల్ల జ్ఞానము శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిని అయిన శ్రీ ఉమా మహేశ్వరి అమ్మవారి ఆరాధించుట వలనను సమస్త సన్మంగళములు సిద్ధించును హనుమత్ ఆరాధన వలన సమస్త శత్రు బాధలు ప్రయోగ బాధల నివారణ జరుగును ప్రత్యేకముగా శ్రీ మహాగణపతి (విరూపాక్ష గణపతి) పరబ్రహ్మ స్వరూపమైనందన ఆలయములో ఉన్న ఇతర దేవతా మూర్తులు పరివార దేవతలైనందున గణపతిని ఆరాధించుట వలన పైన పేర్కొనబడిన కోరికలు అన్నియు తీరుననుటలో సందేహము లేదు అట్లే ఆలయములో వెలసిన సర్పబంధ విగ్రహములకు అభిషేకాదులు రాహు కేతు పూజ నిర్వహించడం వలన కాలసర్ప సర్ప దోషములు తొలగి భక్తుల అభీష్టం నెరవేరును.


రోజువారీ/వారము పూజ - Daily/Weekly Pooja



నెలవారీ పూజ - Monthly Pooja



సంవత్సరాది పూజ - Yearly Pooja